ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా – ||2||
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు – ||2|| ||ఈ లోకంలో||
(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు ||2||
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను ||2|| ||ఈ లోకంలో||
(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే ||2||
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను ||2|| ||ఈ లోకంలో||