Ee Loka Yathralo:
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ ||2||
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు ||2||
అయినాను క్రీస్తేసు నా తోడనుండు ||2|| ||ఈ లోక||
జీవిత యాత్ర ఎంతో కఠినము ||2||
ఘోరాంధకార తుఫానులున్నవి ||2||
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు ||2||
కాయు వారెవరు రక్షించేదెవరు ||2|| ||ఈ లోక||
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా ||2||
అనుదినము నన్ను ఆదరించెదవు ||2||
నీతో ఉన్నాను విడువలేదనెడు ||2||
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ||2|| ||ఈ లోక||
తోడై యుండెదవు అంతము వరకు ||2||
నీవు విడువవు అందరు విడచినను ||2||
నూతన బలమును నాకొసగెదవు ||2||
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే ||2|| ||ఈ లోక||