ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము ||2||
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ ||2|| ॥ఈ మరణము॥
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే ||2||
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ||2||
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు ||2||
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో ||2||
కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును ||2||
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును ||2||
గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥