Ee Udayamuna:
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – ||2|| ||ఈ ఉదయమున||
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం ||2||
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున||
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా ||2||
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – ||2||