Ihamanduna:
ఇహమందున ఆ పరమందు నాకు
గృహమొసగిన నా దైవమా
మితిలేని ప్రేమతో గతిలేని నాకు
స్థితినొసగిన నా స్నేహమా ||2||
యేసయ్యా నీవే నా ఆద్యంతం
యేసయ్యా నీలోనే నా ఆత్మీయం
యేసయ్యా నీకై నా ఆరాటం
యేసయ్యా నీతోనే నా ఆనందం
నీవే నా ఆశీర్వాదం
నీతోనే నా అనుబంధం ||2|| ||ఇహమందున||
నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదం ||2||
అని యెహోషువా నిను కొనియాడినంతగా
కీర్తించనా నిను స్తుతియించనా
నీ మేలులను నే చాటించనా ||2||
యేసయ్యా నీవే నా సమీపం
యేసయ్యా నీలోనే నే సంపూర్ణం
యేసయ్యా నీకై నా సామర్ధ్యం
యేసయ్యా నీతోనే నా సంతోషం
నీవే నా సర్వస్వం
నీతోనే నా సహవాసం ||2|| ||ఇహమందున||
నీ ఇంటి లోనికి నను చేర్చడానికి
ఈ భువికేగి సిలువలో బలి అయితివా ||2||
మరిలేచి మహిమతో ఏతెంచితివే
మధ్యాకాశమున నిను వీక్షించుటే
నీ కొరకు నాకున్న నిరీక్షణ ||2||
యేసయ్యా నీవే నా ప్రస్థానం
యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం
యేసయ్యా నీకై నా ప్రావీణ్యం
యేసయ్యా నీతోనే నా ప్రయాణం
నీవే నా ప్రపంచం
నీతోనే నా ప్రతి నిమిషం ||2|| ||ఇహమందున||