Israyelu Sainyamunaku:
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ||2||
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ||2||
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే ||2||
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి ||2||
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి ||2||
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి ||2||
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి ||2||
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి ||2||
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి ||2||
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము ||2|| ||ఇశ్రాయేలు||