ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా ||2||
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా ||2||
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి ||2|| ||ఆలకించే దేవా||
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా ||2||
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి ||2|| ||ఆలకించే దేవా||
నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా ||2||
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి ||2|| ||ఆలకించే దేవా||