ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు ||2||
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||
పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి ||2||
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను ||2|| ||అర్హుడవు||
దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా ||2||
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను ||2|| ||అర్హుడవు||
దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి ||2||
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను ||2|| ||అర్హుడవు||