Iddarokarigaa maareti Song lyrics:
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము ||2||
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ||2||
1. ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి ||2||
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను ||2|| ||వివాహమన్నది||
2. ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి ||2||
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం ||2|| ||వివాహమన్నది||
3. భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ ||2||
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి ||2|| ||వివాహమన్నది||