Aa Bhojana Pankthilo:
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను ||2||
కన్నీళ్లతో పాదాలు కడిగింది
తన కురులతో పాదాలు తుడిచింది ||2||
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన ||2||
జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను బ్రతికించెను ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన ||2|| ||ఆ భోజన||
సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన ||2|| ||ఆ భోజన||