ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే ||2||
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను ||2|| ||ఆహా||
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ ||2||
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి ||2|| ||ఆహా||
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని ||2||
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె ||2|| ||ఆహా||
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో ||2||
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే ||2|| ||ఆహా||