Ascharya Karudu Song lyrics:
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త ||2||
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ||2|| ||ఆశ్చర్యకరుడు||
1. తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను ||2||
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు ||2||
నీటిపై ఠీవిగా నడచినవాడతడు ||2|| ||ఆశ్చర్యకరుడు||
2. మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు ||2||
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు ||2||
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు ||2|| ||ఆశ్చర్యకరుడు||