Aatmeeya Gaanaalatho Song lyrics:
ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా ||2||
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా ||2||
ఆరాధించనా నీ పాద సన్నిధి ||2||
స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా ||2|| ||ఆత్మీయ||
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా ||2||
కెరూబులు సెరాపులు ||2||
దీవా రాత్రులు నీ సన్నిధిలో ||2||
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా ||2|| ||స్తుతి పాత్రుడా||
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా ||2||
పూజార్హుడా స్తోత్రార్హుడా ||2||
అతి సుందరుడా మనోహరుడా ||2||
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో ||2|| ||స్తుతి పాత్రుడా||
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా ||2||
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన ||2||
స్వరమును కలిగిన ఘననీయుడా ||2||
శిరము వంచనా సర్వోన్నతుడా ||2|| ||స్తుతి పాత్రుడా||