Aatma Varshamunu Song lyrics:
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా ||2||
నీ ఆత్మ చేత అభిషేకించి ||2||
నీ కృప చేత బలపరచయ్యా ||2||
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ||
బలహీనతతో నన్ను బలపరచుము
ఒంటరైన వేళలో ధైర్యపరచుము ||2||
కృంగిన వేళ నీ దరి చేర్చి ||2||
నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా ||2|| ||నే ఉన్నది||
ఆత్మీయుడవై నన్ను ఆదరించుము
అలసిన వేళ దర్శించుము ||2||
అవమానములో నీ దరి చేర్చి ||2||
నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా ||2|| ||నే ఉన్నది||