Aakasha Vaasulara:
ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి ||2||
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ||
ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా ||2||
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ||
సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా ||2||
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ||
క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా ||2||
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ||