ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా ||2||
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి ||2||
కాపాడితివి నడిపితివి ||2||
నీ యింటికి మమ్ములను ||2|| ||ఆకాశ||
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు ||2||
నీదు కల్వరి రక్తమున ||2||
నీవే కడుగు కరుణామయా ||2|| ||ఆకాశ||
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు ||2||
నీతి న్యాయముల నిమ్ము ||2||
స్తుతియింప నిరతంబు ||2|| ||ఆకాశ||
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ ||2||
విజయమిమ్ము మా విజయుండా ||2||
నిజమైన నీ ప్రజలకు ||2|| ||ఆకాశ||
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి ||2||
విలువైన నీ రక్షణను ||2||
ధరింప చేయుము హల్లెలూయా ||2|| ||ఆకాశ||