Aakasamandunna Aasinuda:
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను ||2||
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా ||2||
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా ||2||
కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||