Ambaraaniki antelaa manamantha song lyrics:
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా ||2||
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం ||2||
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం ||2|| ||లాల||
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు ||2||
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే ||2||
పశుల పాకలో పరుండియుండెనే ||లాల||
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని ||2||
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు ||2||
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే ||2||
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా ||2||
సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||