ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను ||2||
నా జీవితాంతం ఆ ప్రేమలోనే ||2||
తరియించు వరమే దొరికెను ||2|| ||ఊహించ||
నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను ||2||
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను ||2|| ||ఊహించ||
నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను ||2||
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము ||2|| ||ఊహించ||