Ninnu Kaapaadu Devudu song lyrics:
నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు ||2||
ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||
శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా ||2||
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా ||2||
భయమేల నీకు – దిగులేల నీకు ||2||
కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||
రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా ||2||
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా ||2||
భయమేల నీకు – దిగులేల నీకు ||2||
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||