Naa thandri song lyrics: Swapna Edwards
నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు ||2||
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది ||2||
నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం||
నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు ||2||
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||