Naa priyamaina yesu prabhu song lyrics:
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని ||2||
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని ||2|| ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం ||2||
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై ||2|| ||నా ప్రియమైన||
లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని ||2||
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై ||2|| ||నా ప్రియమైన||
ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు ||2||
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము ||2|| ||నా ప్రియమైన||
మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును ||2||
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి ||2|| ||నా ప్రియమైన||