Naa naanna intiki song lyrics:
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి ||2||
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||
మగ్ధలేని మరియలాగా ||2||
నీ పాదాలు చేరెదను ||2||
కన్నీటితో నేను కడిగెదను ||2||
తల వెంట్రుకలతో తుడిచెదను ||2|| ||నా నాన్న||
బేతనీయ మరియలాగా
నీ సన్నిధి చేరెదను ||2||
నీ వాక్యమును నేను ధ్యానింతును ||2||
ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||2|| ||నా నాన్న||
నీ దివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా ||2||
పరలోక ఆనందం పొందెదను ||2||
ఈ లోకమును నేను మరిచెదను ||2|| ||నా నాన్న||