Naa krupa neeku chaalani song lyrics:
నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ ||2|| ||నా కృప||
నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని ||2||
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును ||2||
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని ||2|| ||నాతో||
పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని ||2||
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని ||2||
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని ||2|| ||నాతో||