Naa koraku bali ayina song lyrics: Prabhu Kumar
నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ ||2||
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ ||2||
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ ||2||
క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు||
నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై ||2||
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా ||2||
నా మంచి యేసయ్యా ||2|| ||నా కొరకు||
నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం ||2||
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా ||2|| ||నా కొరకు||