Iyyala Intla Repu Mantla:
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల ||2||
ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే ||2|| ||ఇయ్యాల||
నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది ||2||
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే ||2|| ||ఇయ్యాల||
ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న ||2||
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా ||2|| ||ఇయ్యాల||
మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా ||2||
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా ||2|| ||ఇయ్యాల||
సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు ||2||
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు ||2|| ||ఇయ్యాల||