Israyelu Raajuve:
ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు ||2||
యేసయ్యా… యేసయ్యా… ||2||
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై
ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి ||2|| ||యేసయ్యా||
ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము ||2|| ||యేసయ్యా||