ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ||2||
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి ||2||
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||
ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి ||2||
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||