ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా ||2||
దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా ||2||
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై ||2|| ||ఎవరో||
ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా ||2||
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై ||2|| ||ఎవరో||
పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై ||2||
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో ||2|| ||ఎవరో||
యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా ||2||
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా ||2|| ||ఎవరో||
యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై ||2||
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని ||2|| ||ఎవరో||