ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి ||2||
అంతలోనే కన్ను మూసి పోతివా ||2||
ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి ||2||
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా ||2|| ||ఎంత||
కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని ||2||
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా ||2|| ||ఎంత||