ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు ||2||
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక||
బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు ||2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను ||2|| ||నీకే||
పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు ||2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను ||2|| ||నీకే||