ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు ||2||
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా ||2|| ||ఏ యోగ్యత||
మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే ||2|| ||ఏముంది||
పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా ||2|| ||ఏముంది||