ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్ ||2||
విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే ||2|| ||ఎల్లవేళలందు||
సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే ||2|| ||ఎల్లవేళలందు||
జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే ||2|| ||ఎల్లవేళలందు||
జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే ||2|| ||ఎల్లవేళలందు||
నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే ||2|| ||ఎల్లవేళలందు||
జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే ||2|| ||ఎల్లవేళలందు||
కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే ||2|| ||ఎల్లవేళలందు||