ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది ||2||
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది ||2|| ||ఎక్కడో||
జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది ||2||
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది ||2|| ||ఎక్కడో||
ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది ||2||
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది ||2|| ||ఎక్కడో||