ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది ||2||
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు ||ఈ జీవితం||
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు ||2||
పోతున్నవారిని నువు చుచుటలేదా ||2||
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ||2|| ||ఈ జీవితం||
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు ||2||
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ||2||
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి ||2|| ||ఈ జీవితం||
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు ||2||
యేసు రక్తమే నీ పాపానికి మందు ||2||
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు ||2|| ||ఈ జీవితం||