ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||2||
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు ||2||
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో||
నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు ||2||
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను ||2||
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో ||2|| ||ఏడుస్తున్నాడేమో||
సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు ||2||
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను ||2||
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో ||2|| ||ఏడుస్తున్నాడేమో||