ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ ||2||
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను ||2||
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను ||2|| ||ఎడబాయని||
కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా ||2|| ||నన్ను బలపరచెను||
నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే ||2|| ||నన్ను బలపరచెను||
నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా ||2|| ||నన్ను బలపరచెను||