ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో ||2||
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో ||2|| ||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున ||2|| ||ఆనందమే||
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున ||2|| ||ఆనందమే||
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము ||2|| ||ఆనందమే||