Amulyamaina Aanimuthyama song lyrics :
అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా ||2||
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు ||2|| ||అమూల్యమైన||
1. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు ||2||
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు ||2|| ||అమూల్యమైన||
2. చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు ||2||
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు ||2|| ||అమూల్యమైన||
3. దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు ||2||
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు ||2|| ||అమూల్యమైన||