Naa Yesu Prabhuvaa song lyrics:
నా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును ||2||
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో ||2||
నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును ||2|| ||నీ ప్రేమా||
నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును
నీ కోసమే నే జీవింతున్
నిజమైన ప్రేమికుడా ||2|| ||నీ ప్రేమా||
యేసయ్యా నా రక్షకా
యేసయ్యా నా జీవమా
యేసయ్యా నా స్నేహమా
నాదు ప్రాణ ప్రియుడా ||2|| ||నీ ప్రేమా||