Ee Sthuthi Neeke:
ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము – ||2||
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా ||2|| ||ఈ స్తుతి||
జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని ||2||
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని ||2||
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||
మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా ||2||
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా ||2||
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని ||ఈ స్తుతి||